Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మూలాపేటలోని ప్రసిద్ధ శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా అన్న ప్రసాద మండపాన్ని నిర్మించనున్నారు. ఈ మండప నిర్మాణానికి శుక్రవారం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య సాగిన శంఖుస్థాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగమణి, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మైన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, జంగం కార్పొరేషన్ ఛైర్మైన్ వావివేటి ప్రసన్న, కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యులు చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
