Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థ ప్రణాళికా బద్ధంగా నడిచేందుకు కార్యదర్శులంతా విధుల్లో బాధ్యతగా మెలగాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ డి.హరిత సూచించారు. నగరంలోని మినీ బైపాస్ రామలింగాపురంలోని 19/1, 19/2 సచివాలయాలను కమిషనర్ బుధవారం పరిశీలించారు. అన్ని విభాగాల కార్యదర్శులు ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క కార్యదర్శి ఆన్ లైన్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఆస్థి పన్నులు, యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
