Clock Of Nellore ( Sullurpeta ) – రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. బృందాలుగా విడిపోయిన ఏసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంపై స్పందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో కూడా ఏసిబి అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంలో అడుగు అడుగు తనిఖీ చేశారు. అధికారుల వ్యక్తిగత వాహనాల్లో కూడా సోదాలు చేశారు. ఏసిబి దాడులకు గుర్తించిన కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ తన వద్ద అనధికారికంగా ఉన్న ఒక లక్షా 93వేల రూపాయల నగదును కిటికీల్లోంచి బయటకు విసిరేశారు. దీన్ని గమనించిన ఏసిబి అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో పలు చోట్ల నగదు ఉండగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువుర్ని ప్రశ్నించారు. వివిధ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.