Clock Of Nellore ( Nellore & Kavali ) – తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైసీపి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలిశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కావలి పట్టణంలోని వారి నివాసంలో కలిసి సత్కరించారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిస్థాయి సహకారం అందించి తన గెలుపుకు కృషి చేయాలని అభ్యర్ధించారు. తరువాత నెల్లూరులో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తిని కూడా పేర్నాటి కలిసి మద్దతు కోరారు.

Tags: Kavali mla Ramireddy Prathap Kumar Reddy Mlc Balli kalyana chakravarthi Nellore MLC Elections YCP Leader Pernati Syam prasad Reddy