Clock Of Nellore ( Nellore ) – కరెన్సీ నోట్ల ముద్రణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బాధ్యత గల ముఖ్యమంత్రి అలా మాట్లాడటం దురదృష్ఠకరమని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న వినోద్ రెడ్డి సిఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిఎం జగన్ ను వరద బాధితులు ఆర్ధిక సాయం 10వేలకు పెంచాలని కోరగా కేంద్ర ప్రభుత్వం డబ్బు లేదని చెబుతుందని సిఎం అనడం అవగాహన లేమికి నిదర్శనంగా ఉందన్నారు. కరెన్సీ నోట్లు ముద్రించే కేంద్ర ప్రభుత్వమే డబ్బులేదని ప్రజలకు చెప్పడం… కరెన్సీ నోట్ల ముద్రణపై ప్రజల్లో అపోహలు పెంచడమేనని పేర్కొన్నారు. వందలాది మంది సలహాదారులు ఉన్న ముఖ్యమంత్రి ఆర్ధిక పరమైన అంశాల్లో ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతారా అని కేతంరెడ్డి విమర్శించారు.
