రైల్వే స్థలాల్లోని వారికి పట్టాలు : ఇంటికి వెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే స్థలంలో ఇళ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న 80 కుటుంబాల వారికి ప్రత్యామ్నాయ స్థలాలకు సంభందించి ఇళ్ల పట్టాలు అందజేశారు నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్. గురువారం స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. నిరుపేదలకు వైసీపి ఎప్పుడూ అన్యాయం చేయదని భరోసా ఇచ్చారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు పట్టాలు అందజేశానన్నారు. కొంత మంది ఇళ్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేశారని, పేదలకు ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ సుజాత, షేక్ సఫియా బేగం, కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యులు షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

మేయర్ స్రవంతి దంపతులను సత్కరించిన పేర్నాటి… ఇంకొదరిని కూడా

Read Next

జడ్పీ ఛైర్మైన్ ఆనం అరుణమ్మను కలిసిన పేర్నాటి…

Leave a Reply

Your email address will not be published.