Clock Of Nellore ( Chillakur ) – తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిలో వరగలి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన 5 మంది నెల్లూరు నుండి నాయుడుపేట వైపు కారులో వెళుతుండగా రాంగ్ రూట్ లో వట్టిన దొడ్ల డైరీకి చెందిన ట్యాంకర్, కారును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యక్తిగత పనులపై వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతి చెందిన వారు బసవరాజు, మంజు గా పోలీసులు గుర్తించారు. గిరీష్, శివరామ కృష్ణ, వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా వారిని వైద్యం కోసం నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.