Clock Of Nellore ( Ongole ) – తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట కుటుంబం వైసీపితోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా తప్పుబట్టారు. 2019లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా తమను వైసీపిలోకి ఆహ్వానించారని, తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తున్నారని చెప్పారు. కొంత మంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం మాగుంట కుటుంబం వైసీపితోనే ఉంటుందని స్పష్టం చేశారు.