Clock Of Nellore ( Ramaya Patnam ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నెల్లూరుజిల్లా రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో అక్కడి ఏర్పాట్లను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు పరిశీలించారు. శంఖుస్థాపన శిలాఫలకాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిఎం సభను విజయవంతం చేయాలని కాకాణి పిలుపునిచ్చారు. ఎస్పీ ట్రయల్ కాన్వాయ్ ను నిర్వహించారు. పూర్తి స్థాయి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
