రేపే సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన – రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన

Clock Of Nellore ( Ramayapatnam ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు ( Ramaya Patnam Port ). దీనికి సంభందించి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సముద్రం ఒడ్డున శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. కొద్ది సమీపంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెయిన్ ఫ్రూఫ్ పందిళ్లను వేశారు. సభా ప్రాంగణమంతా ఇసుక కావడంతో సభకు వచ్చిన వారు కూర్చునేందుకు ఇబ్బంది లేకుండా నేలపై నాపరాళ్లను వేసి దానిపై కుర్చీలను వేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు సిఎం కార్యక్రమం ప్రారంభం కానుంది.

సిఎం జగన్ పర్యటన వివరాలు…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 10.40 గంటలకు తాడేపల్లి నివాసం నుండి హెలికాప్టర్ లో బయలు దేరుతారు. 10.50 గంటలకు రామాయపట్నంకు చేరుకుంటారు. హెలికాప్టర్ దిగి 11 గంటలకు రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన చేస్తారు. తర్వాత సభా ప్రాంగణానికి చేరుకుని 12.30 గంటల వరకూ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ తిరిగి తాడేపల్లికి తిరిగి వెళ్తారు.

Read Previous

నెల్లూరు ఆటోనగర్ రాష్ట్రానికే తలమానికం : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

త్వరలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలు – వెల్లడించిన కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.