నిర్ధిష్ఠ గడువులోగా స్పందన అర్జీలకు పరిష్కారం – కమిషనర్ జాహ్నవి

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందజేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi ) అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన వేదికను కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు ( Nellore Muncipal Corporation ). ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంభందించి 29 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. జగనన్న కాలనీ నివేశన స్థలాలు, టిడ్కో గృహాల మంజూరు వివరాలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నామని కమిషనర్ తెలిపారు. అదే విధంగా వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన వారి జాబితాలను కార్యాలయంతో పాటు సచివాలయాల్లో సైతం అందుబాటులోకి తెచ్చామని, పథకాలకు సంభందించిన వివరాలకై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

నన్ను టచ్ చేసే దమ్ముందా ? : వారి కుట్రలు సాగవని హెచ్చరించిన కోటంరెడ్డి

Read Next

అల్లూరికి ఘన నివాళి అర్పించిన మేయర్ స్రవంతి, కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.