రాజమ్మకు 50వేల ఆర్ధిక సాయం చేసిన ఎంపి ఆదాలు… పవర్ లిఫ్టర్ కు అభినందన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని సంగం మండలం, తరుణవాయికి చెందిన దొడ్ల రాజమ్మకు రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి 50వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. తరుణవాయి సర్పంచ్ బాల నాయుడు సమక్షంలో వారి కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే ఏసియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన నెల్లూరుకు చెందిన షేక్ సాఖిబ్ బాషను ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి నెల్లూరుకు మంచి పేరు తీసుకురావాలని కాంక్షించారు.

Read Previous

ఎన్టీఆర్ విగ్రహం ముందు డివైడర్ ను తొలగించిన టిడిపి నేతలు

Read Next

పవన్ కళ్యాణ్ సిఎం కాగానే ఉద్యోగ ఖాళీలు భర్తీ – కేతంరెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.