Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో నియమితులైన గ్రామ, వార్డు కార్యదర్శులకు ఉత్తమ భవితవ్యం కల్పించేందుకు వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత అభినందనీయం అని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ అసోసియేషన్ (రి.నెం.13/2020) ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు మేయర్ ను ఆమె చాంబర్ లో శనివారం కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు మరింత భాద్యతాయుతంగా వ్యవహరిస్తూ తమ విధుల పట్ల అంకిత భావం కలిగి వుండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను అర్హులైన లబ్దిదారులందరికీ అందేలా సంక్షేమ వారధులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి హరీష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెంకటేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, నగర అధ్యక్షులు బాలు, నగర ప్రధాన కార్యదర్శి సుమన్, అసోసియేషన్ సభ్యులు వినీలా, ఖాలీద్, కోటి, నరేష్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
