పోలీస్ పేరుతో నిలువు దోపిడి – వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరుగుతూ తాను పోలీసునని ఒంటరిగా ఉండే వారిని బెదిరించి చోరీ చేసే వ్యక్తిని నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వివరాల్లో కెళ్తే… కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన షేక్ షఫీ అనే వ్యక్తి ప్రస్తుతం నెల్లూరులోని కోవూరులో నివాసం ఉంటున్నాడు. పాత నేరస్తుడైన షఫీ గతంలో కూడా అనేక చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి బెయిలుపై బయట ఉన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీనా నెల్లూరు జిజిహెచ్ వద్ద 75 ఏళ్ల దగ్గుమాటి వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఉండగా అక్కడకు వెళ్లిన షఫీ తాను పోలీసునని చెప్పి ఈ సమయంలో ఇక్కెడుందుకున్నావంటూ ఆయన చేతికున్న బంగారు ఉంగరాలను దోచుకొని వెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న దర్గామిట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతన్ని అరెస్ట్ చేసి ఉంగరాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా దర్గామిట్ట సిఐ దశరధరామరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసే కాకుండా గతంలో కూడా అతను బాలాజీ నగర్, సంతపేట, సంగం, చిన్నబజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.

Read Previous

మేయర్ స్రవంతిని కలిసిన వార్డు సచివాలయ కార్యదర్శులు…

Read Next

అధికారం తలకెక్కితే ప్రజలు వాత పెడతారు… సామాన్యుడిగానే ఉంటానన్న కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.