నెల్లూరులో 40వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట… ఇంటింటికి కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 40వ రోజుకు చేరుకుంది. 40వ రోజైన శనివారం ఆయన మైపాడు రోడ్డులోని సత్య నారాయణ పురం సెంటర్, వైకుంఠపురం ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 40 రోజుల్లో సుమారు 10వేల కుటుంబాలను పలకించినట్లు వినోద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలనే సంకల్పంతో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం 40 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లగా ప్రజలు ఎంతో స్వాగతించారని ఆనందం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు ఏ మాత్రం భయపడకుండా సమస్యలను స్వేచ్ఛగా చెబుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో కూడా అపూర్వ స్పందన వస్తుందన్నారు. అన్నీ వర్గాల ప్రజలు వైసీపి ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపి ఓటమి ఖాయమని కేతంరెడ్డి అన్నారు.

 

Read Previous

తిరుమల వ‌సంత‌మండ‌పంలో ” అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష ” ప్రారంభం

Read Next

రేపే ఆత్మకూరు ఓట్ల లెక్కింపు : 11 గంటల కల్లా ఫలితాలు వెలువడే అవకాశం

Leave a Reply

Your email address will not be published.