ఈనెల 26న ఆత్మకూరు కౌంటింగ్… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంభందించి నిన్న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లోకి చేర్చారు. సీలు వేసి కేంద్ర భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 26వ తేదీనా కౌంటింగ్ జరగనుంది. ఈ నేపద్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు… ఎస్పీ విజయరావుతో కలిసి స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్, ఆత్మకూరు ఆర్డీఓ బాపిరెడ్డిలతో చర్చించారు. అనంతరం కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.

Read Previous

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

Read Next

నెల్లూరులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్ఠి సారించిన కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.