Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడక్కడా ఈవిఎంలు మొరాయించగా వాటి స్థానంలో సిద్ధంగా ఉంచిన నూతన ఈవిఎంలను అమర్చి పోలింగ్ ను మొదలు పెట్టారు. ఉదయం మందకొడిగా పోలింగ్ సాగింది. తర్వాత పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం మళ్లీ మందకొడిగా సాగి తర్వాత మళ్లీ యధావిధిగా పోలింగ్ సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 44.14 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. వైసీపి అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి, బిజేపి అభ్యర్ధిగా భరత్ కుమార్ యాదవ్ తో సహా మొత్తం 14 మంది బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.
