Clock Of Nellore ( Atmakur ) – ఈనెల 23వ తేదీ జరిగే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఆత్మకూరులోని ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులు వినూత్న ప్రదర్శన ఇచ్చారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా… గో ఓట్ … 23/6 … అనే అక్షరాలు గల ఆకృతిలో విద్యార్ధులంతా కూర్చొని ఓటర్లకు ప్రత్యేకంగా సందేశం ఇచ్చారు. ఆ విద్యార్ధులను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు.
