Clock Of Nellore ( Kota ) – తిరుపతి జిల్లా కోట మండలం, కొత్తపట్నంలో ఉన్న కోరమాండల్ అట్టపెట్టెల తయారీ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో కార్మికులెవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల చెలరేగాయి. అట్టపెట్టెలు కావడంతో నిముషాల్లో మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న అట్టపెట్టలన్నీ దగ్ధమైనాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపు చేశారు. ప్రమాద సమయంలో కార్మికులెవ్వరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.