చిన్నారి ప్రాణం తీసిన మూఢ నమ్మకాలు… తండ్రి అరెస్ట్

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరు జిల్లాలో పూజల పేరుతో.. కూతురు నోట్లో కుంకమ పోసి, గొంతు నులిమిన ఘటనలో.. బాధిత చిన్నారి (4) ప్రాణాలు కోల్పోయింది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి పునర్విక.. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కూతురు గొంతు నులిమిన తండ్రి వేణును అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శాంతి పూజల పేరుతో.. వేణుగోపాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లను దేవుడి ఫొటోల దగ్గర కూర్చోపెట్టి పూజలు జరిపించాడు. ఆ తర్వాత వేణుగోపాల్ తన తల్లిని పిలిచి.. ఒక పాపను ఆమె చేతికి ఇచ్చి బయటకు వెళ్లి కూర్చోమన్నాడు. అనంతరం మరో పాప పునర్విక నోట్లో కుంకుమ పోసి గొంతు నులిమాడు. పాప కేకలతో కుటుంబ సభ్యులు, స్థానికులు పరిగెత్తుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో.. అక్కడి నుంచి చైన్నై ఆసుపత్రికి తరలించారు.

అపస్మారక స్థితిలోనే నిన్నటి నుంచి చికిత్సపొందిన చిన్నారి పునర్విక.. ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు వేణుగోపాల్​ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తండ్రి వేణుగోపాల్​కు మతి స్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.

Read Previous

అట్టపెట్టెల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం… తప్పిన ప్రాణాపాయం

Read Next

రైతు జోరుగా ఉంటే చంద్రబాబుకు బేజారు… ధ్వజమెత్తిన కాకాణి

Leave a Reply

Your email address will not be published.