Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 12వ డివిజన్ పెద్ద చెరుకూరు, గిరిజన కాలనీలో నగర మేయర్ స్రవంతి, వైసీపి నేత జయవర్ధన్ “కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ స్రవంతికి స్థానికులు పూలతో, రంగవల్లులతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలందరికి సంక్షేమ పాలన అందించే దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న విధానాలతో గడప గడపలో సంతోషాలు విరాజిల్లుతున్నాయని, ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం అందుతుందనీ, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు పాలన అనే మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సార్ధకం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ నాయకులు నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి, రాచూరి రమేష్ పాల్గొన్నారు.
