తప్పిన పెను ప్రమాదం… కారు దగ్ధం…

Clock Of Nellore ( Ulavapadu ) – నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పంది. తమ ఇద్దరు పిల్లలతో దంపతులు కారులో ప్రయాణిస్తుండగా ఒక్క సారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమయ్యి వారు కిందికి దిగేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా అగ్నికీలలకు దహనమైంది. వివరాల్లో కెళ్తే… గుంటూరుకు చెందిన ఓ కుటుంబం బెంగుళూరుకు వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఒంగోలు దాటి నెల్లూరుజిల్లా పరిధిలోని ఉలవపాడు వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని నలుగురు వ్యక్తులు కారును నిలిపివేసి కిందికి దిగేశారు. నిముషాల వ్యవధిలోనే కారు మొత్తం దహనమైంది. మరో వైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నప్పటికీ అప్పటికే కారు పూర్తిగా దహనమైంది. ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంపై నేతల సమీక్ష… హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

Read Next

నెల్లూరు మెడికవర్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం…

Leave a Reply

Your email address will not be published.