Clock Of Nellore ( Nellore ) – ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణలో భాగంగా మరమ్మతు పనులను వేగవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi ) అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో గురువారం కమిషనర్ తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, పాదచారులకు సౌకర్యవంతంగా ఉండేలా నగర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు చేరకుండా, డ్రైను కాలువల గుండా అంతరాయం లేకుండా ప్రవహించేలా పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న 7 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షించి, జూన్ మాసాంతం లోపు ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంపత్ కుమార్, సంజయ్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
