ఎమ్మెల్యే కోటంరెడ్డికి పలువురు పరామర్శ – రెండు రోజుల్లో డిశ్చార్జ్

Clock Of Nellore ( Chennai ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి శుక్రవారం సాయంత్రం స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ ప్రాధమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మరో వైపు పలువురు ప్రముఖులు, వైసీపి నేతలు చెన్నై అపోలో హాస్పిటల్ కు వెళ్లి కోటంరెడ్డిని పరామర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనీల్ రెడ్డి, మాజీ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోటంరెడ్డి పరామర్శించి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

వీరితో పాటూ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, టిటిడి ఛైర్మైన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఫోన్ చేసి కోటంరెడ్డి ఆరోగ్యం గూర్చి ఎప్పటికప్పుడు వాకబు చేశారు.

Read Previous

ఏపి జెన్ కో ప్లాంట్ లో సాంకేతిక సమస్యలు… నిలిచిన విద్యుత్ సరఫరా

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డిని పరామర్శించిన సినీ నిర్మాత సి. కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published.