Clock Of Nellore ( Muthukur ) – నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ప్లాంట్ లో బుడిదను వేరు చేసే ఎలక్ట్రోస్టాటిక్ ప్రేసిపిటేటర్స్ హోప్పర్స్ విఫలం అయి కూలి పోయింది. మొత్తం 128 హోప్పర్స్ విఫలం కావడంతో రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి స్తంభించిపోయింది. మరమ్మత్తులకు రెండు వారాల పాటూ సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు.
Tags: Muthukur Ap Genco Plant