Clock Of Nellore ( Nellore ) – గుంటూరులో ఉన్న జిల్లా టవర్ పేరును తొలగించి ఆ పేరుకు బదులు భారత దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం పేరును పెట్టాలని భారతీయ జనతా యువమోర్చా నెల్లూరుజిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన నెల్లూరులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. తమ విజ్ఞాపనను ప్రభుత్వం దృష్ఠికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై స్పందించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్ఠికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవ్, కిరణ్, నవీన్ , మస్తాన్, వెంకట్, పృద్వి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.