గడప గడపకు మన ప్రభుత్వం… ఎమ్మెల్యే కోటంరెడ్డికి ప్రజల నీరాజనం

Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. నిరాడంబరంగా సాగుతున్న ఈ కార్యక్రమం 39 రోజులకు చేరుకుంది. 39వ రోజైన గురువారం కలివెలపాళెం బీసి కాలనీలో పర్యటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ప్రభుత్వం పథకాలపై ఆరా తీశారు. పథకాలు అందకపోతే తనకు తెలియజేయాలన్నారు. కలివెలపాళెం గ్రామంలో ఇప్పటి వరకూ 3.81 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 1.73 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులు త్వరలో పూర్తి చేస్తామని కోటంరెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు.

Read Previous

రేపటి నుంచి రాష్ట్రంలో తక్కువ ధరకే టమాట విక్రయాలు… మంత్రి కాకాణి వెల్లడి

Read Next

త్వరితగతిన పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు – కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.