విద్యార్ధులను ఇబ్బంది పెడితే సహించను : కళాశాలలకు కోటంరెడ్డి హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) – ఫీజుల పేరుతో వసూళ్లకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. డిగ్రీ విద్యార్ధుల వద్ద పరీక్ష ఫీజు పేరుతో అధికంగా వసూలు చేస్తున్నట్లు తన దృష్ఠికి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే కొందరు విద్యార్ధుల పరీక్ష ఫీజు కట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ చోటుచేసుకున్నా విద్యార్ధులు తన ఫోన్ నంబర్ 8557 999 999 కి ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. 

Read Previous

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంను కలిసిన తిరుపతి డి.ఆర్.డి.ఏ పిడి

Read Next

కర్నాటక ముఖ్యమంత్రితో ఆనం కార్తికేయరెడ్డి భేటీ…

Leave a Reply

Your email address will not be published.