కొండ్లపూడిలో గడప గడపకు మన ప్రభుత్వం – ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న గడప గడపకూ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం 32 రోజులు పూర్తి చేసుకుంది. 33వ రోజైన శుక్రవారం కొండ్లపూడి గ్రామంలో కార్యక్రమాన్ని చేపట్టారు. గడప గడపకు – మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వారి నివాసాల్లో కూర్చొని కుటుబసభ్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యేనే స్వయంగా తమ ఇంటికి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Read Previous

ఆనంను కలిసిన క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి…

Read Next

మెడికవర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : సేవలను కొనియాడిన డాక్టర్ గణేష్

Leave a Reply

Your email address will not be published.