నెల్లూరుజిల్లాలో విషాదం : కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Clock Of Nellore ( Sangam ) – సరదాగా ఆడుకుంటూ కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ విషాద ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. సంగం మండల కేంద్రంలోని హరిజన వాడ సమీపంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ పక్కన అదే గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న రాము, ఈశ్వర్ అనే చిన్నారులు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు. ఇతర చిన్నారుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాలువలో గాలించగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో హరిజన వాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందు ఆనందంగా ఆడుకుంటూ కనిపించిన చిన్నారులు క్షణాల్లో శవాలుగా మారడంతో అందరూ నిర్ఘాంతపోయారు. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారిపోయింది.

Read Previous

దాహార్తి తీర్చుకునేందుకు వచ్చి సోమశిల జలాశయంలో పడి దుప్పి మృతి

Read Next

బాలాజీ నగర్ లో వీధి కుక్కల హల్ చల్… గాయాల పాలవుతున్న చిన్నారులు

Leave a Reply

Your email address will not be published.