Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 14వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్ లో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. కుక్కల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చిన్నారులు కుక్కల దాడికి గురై గాయాల పాలవుతున్నారు. రోడ్లపై వీధి కుక్కలు హల్ చల్ చేస్తూ అటుగా వెళ్తున్న పాదచారులపై దాడి చేస్తున్నాయి. కార్పొరేషన్ సిబ్బంది కుక్కల బెడద విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. తాజాగా బాలాజీ నగర్ ప్రాంతంలో ఓ చిన్నారి సైకిల్ తొక్కుతూ వెళుతుండగా కుక్కల మంద ఆ బాలికను వెంబడించింది. ఓ కుక్క బాలికను కరిచింది. స్థానికులు అప్రమత్తమయ్యి కుక్కలను తరమడంతో బాలిక ప్రమాదం నుండి బయటపడింది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించాల్సి ఉంది.