వాకాడులో తల్లీ కుమార్తె బలవన్మరణం – కారణాలపై పోలీసుల ఆరా

Clock Of Nellore ( Vakadu ) – తిరుపతిజిల్లాలో కలిసిన ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని వాకాడు మండల కేంద్రంలో తల్లీ, కుమార్తె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏ కష్టమొచ్చిందో ఏమోగానీ ఇద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద షాకిరా ( 55 ) నివాసం ఉంటుంది. ఆమెతో పాటూ కుమార్తె మబ్బుల్ ( 35 ) కూడా అక్కడే నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం ఇద్దరూ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతో గమనించిన స్థానికులు ఉరివేసుకుని ఉండగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాకాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కిందికి దించి పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఆర్ధిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Previous

సాయంత్రం సిఎంతో మేకపాటి భేటీ – ఆత్మకూరుపై చంద్రబాబు సమీక్ష

Read Next

పలు చోట్ల అపరిశుభ్రత… అధికారులపై కమిషనర్ జాహ్నవి ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.