Clock Of Nellore ( Amaravathi ) – అమరావతిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖలో అమలవుతున్న అనేక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న రంగాలపై అడిగి తెలుసుకున్నారు. శాఖాపరంగా ఉన్నతంగా పనిచేసి వ్యవసాయశాఖను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులకు కాకాణి విజ్ఞప్తి చేశారు.
