Clock Of Nellore ( Nellore ) – నాడు – నేడు పథకం ద్వారా పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటూ నూతన భవనాలను నిర్మిస్తున్నామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ) అన్నారు. నగరంలోని మూలాపేట ఉన్న ఈఎస్ఆర్ఎం హైస్కూల్లో 2వ విడత నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఒక కోటి 44 లక్షల రూపాయలతో నూతన స్కూలు భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే అనీల్ శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు నాగమణి, నీలి రాఘవ రావు, నేతలు నాగరాజు, జనార్ధన్ రెడ్డి, జంగం కార్పొరేషన్ ఛైర్మైన్ వావిలేటి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
