Clock Of Nellore ( Nellore Rural ) – జగనన్న మాట – గడప గడపకూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA KotamReddy ) చేపడుతున్న పాదయాత్ర 7వ రోజుకు చేరింది. గత రాత్రి కొత్త వెల్లంటిలోని పోలవరపు దిలీప్ నివాసంలో బస చేసిన కోటంరెడ్డి ఇవాళ ఉదయం బొడ్డు వెంకటేశ్వర్ రెడ్డి నివాసం నుండి ఇంటింటికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడప గడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానికులతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముచ్చటించారు. కొత్త వెల్లంటి గ్రామంలో 4.23 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 2.56 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలియజేశారు. మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
