Clock Of Nellore ( Nellore Rural ) – జగనన్న మాట – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతీ గడపనూ తొక్కుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా కొత్త వెల్లంటిలో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ( Nellore Rural MLA KotamReddy ) ఇవాళ ఆదాల కలిసి తన సంఘీభావాన్ని తెలియజేశారు. కోటంరెడ్డితో కలిసి కొన్ని నివాసాలకు వెళ్లారు. అనంతరం ఎంపి ఆదాల మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటారని ప్రశంసించారు. అలా ఉన్నప్పుడే ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జగనన్న బాట కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని, తాను కూడా ఆయన అడిగిన విధంగా నిధులను ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా అన్నకు తోడుగా ఉండడం సంతోషించదగిన విషయం అన్నారు. అన్నదమ్ములు ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనకు మద్దతు ఇచ్చిన ఎంపీ ఆదాలకు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు, స్థానిక నేతలు పలువురు పాల్గొన్నారు.
