Clock Of Nellore ( Buero Report ) – ఉమ్మడి నెల్లూరుజిల్లాలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ( Ambedgar Jayanthi ) వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం నెల్లూరుతో సహా జిల్లాలోని వాడవాడలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. నెల్లూరు విఆర్సీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నగర మేయర్ స్రవంతి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాళులు అర్పించారు. గుంటూరులో జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. జనసేన పార్టీ నేతలు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, గునకల కిషోర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ ఆంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. నెల్లూరు రూరల్ సజ్జాపురం గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నెల్లూరు నగరంలోని 31వ డివిజన్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. గూడూరులో బిజేపి నేతలు అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. కావలి పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్డీఓ శీనా నాయక్ రక్తదానం చేశారు. నెల్లూరులో బిజేవైఎం అధ్యక్షులు యశ్వంత్ సింగ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. నెల్లూరులో వైసీపి కార్పొరేటర్ మహేష్ కొండాయపాళెం స్కూల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి దుస్తుల పంపిణీ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో సర్పంచ్ లు నివాళి అర్పించారు. జిల్లా ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీ వెంకటరత్నం నెల్లూరు విఆర్సీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే టిడిపి నేతలు అబ్ధుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాళి అర్పించారు.
