నెల్లూరులో మార్కెట్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే అనీల్…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నవాబుపేటలో ఉన్న మార్కెట్ యార్డు స్థలాన్ని నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav )పరిశీలించారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే అనీల్ కు ఏఎంసి ఛైర్మైన్ ఏసునాయుడు స్వాగతం పలికారు. ఖాళీ మార్కెట్ యార్డు స్థలాన్ని పరిశీలించిన అనీల్ కుమార్ యాదవ్ ఆ స్థలంలో షాపుల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. వ్యాపారస్తులకు అనువుగా షాపులను నిర్మిస్తామని దానికి త్వరలోనే శంఖు స్థాపన చేస్తామని అనీల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపి నేతలు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Read Previous

మంత్రి కాకాణిని అభినందించిన వైసీపి సంయుక్త కార్యదర్శి వై.వి. రామిరెడ్డి

Read Next

నెలాఖరులోపూ షాదీ మంజిల్ పనులు పూర్తి : ఎమ్మెల్యే అనీల్ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.