వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వంలో కీలకం… అవార్డులు అందజేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలను ప్రతి ఒక్క వాలంటీర్ సాధించుకునేలా కృషి చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి ( Nellore Mayor Potluri Sravanthi )పేర్కొన్నారు. స్థానిక 17 డివిజన్ ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం సమీపంలోని ఆకుతోట సచివాలయం, 18వ డివిజన్ హరనాథపురం, 6 వ వీధి లోని సచివాలయం, 20వ డివిజన్ వనంతోపు సెంటర్, రుద్రా కాంప్లెక్స్ లోని సచివాలయం, 22వ డివిజన్ మినీ బైపాస్ రోడ్, ఓల్డ్ వేదాయపాలెంలోని సచివాలయం పరిధిల్లో విధులు నిర్వహిస్తున వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్ల ఉగాది పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగం చేసారని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో సైతం ప్రజలకు కావలసిన సేవలు, ప్రజలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వం నుంచి చేరవేసే రథసారథులుగా వాలంటీర్లు నిలిచారని కొనియాడారు. వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది పుర్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకోని వాళ్ళకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో గౌరవాన్ని అందుకోవాలని మేయర్ గారు సూచించారు. ( Nellore Muncipal Corporation ) ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పేనేటి సుధాకర్, తోటకూర అశోక్ కుమార్, చేజెర్ల మహేష్ బాబు, మూలే విజయ్ భాస్కర్ రెడ్డిలు మరియు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Read Previous

మంత్రి పెద్దిరెడ్డికి కొండూరు అజయ్ రెడ్డి సోదరుల అభినందనలు…

Read Next

మంత్రి గోవర్ధనన్నకు డబుల్ ఇస్తా… మాజీ మంత్రి అనీల్ వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published.