మంత్రి గోవర్ధనన్నకు డబుల్ ఇస్తా… మాజీ మంత్రి అనీల్ వ్యాఖ్యలు

Clock Of Nellore ( Nellore ) – తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ రకంగా సహకారం అందించారో అంతకు డబుల్ సహకారం అందిస్తానని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ). అంతే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో వారి శాఖకు సంభందించిన ఏ కార్యక్రమం జరిగినా కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఖచ్చితంగా ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. నెల్లూరులోని రాజన్న భవన్ లో మంగళవారం అనీల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రమాణ స్వీకారానికి కాకాణి గోవర్దన్ రెడ్డి నుండి తనకు ఆహ్వానం అందలేదని అందుకే గైర్హాజరయ్యానని పేర్కొన్నారు.

మాజీలయిన వారంతా బాధపడుతున్న వస్తున్న వార్తలు అవాస్తవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు చెప్పిన టైం కన్నా ఎక్కువ అవకాశం ఇచ్చారన్నారు. తమపై నమ్మకంతోనే మాజీలైన వారంతా పార్టీ బాధ్యతలు చూసుకోవాలని చెప్పారన్నారు. పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, నేడు మంత్రి పదవి లేదు కాబట్టి బాధ్యతగా ఉంటూనే తగ్గేదే లే అన్నట్లు పార్టీ కోసం పనిచేస్తామని అనీల్ వెల్లడించారు. 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని మళ్లీ మంత్రులవుతామని అన్నారు. ఇకపై నిత్యం ప్రజల్లో నిత్యం ఉండేలా ప్రణాళిక రూపొందించామని ఆదివారం లోగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించుకుని వచ్చే వారం నుండి గడప గడపకు వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు ( Nellore City Constency ). నెల్లూరు నగరంలో గత 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి పనులు తాను చేపట్టానని గుర్తు చేశారు. నగరంలో మొత్తం 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వచ్చే నెలలో పెన్నా బ్యారేజీ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ కాదు…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ కాదని బిచ్చం నాయక్ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 130 పై చిలుకు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అలా చేస్తే బీమ్లా నాయక్ అని ఒప్పుకుంటాన్నారు. అలా కాకుండా టిడిపి బిచ్చం ఇచ్చే 30 – 40 సీట్లు తీసుకుని పోటీ చేస్తే ఆయన బిచ్చం నాయక్ తప్పా బీమ్లా నాయక్ ఎలా అవుతారని అనీల్ కుమార్ ప్రశ్నించారు.

Read Previous

వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వంలో కీలకం… అవార్డులు అందజేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Read Next

మంచి నీటి ఎద్దడిపై అధికారులతో మేయర్ సమీక్ష… ముందు జాగ్రత్తలకు ఆదేశం

Leave a Reply

Your email address will not be published.