వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి : మంత్రులకు శాఖలు కేటాయింపు

Clock Of Nellore ( Amaravathi ) – ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. ( AP Cabinet Ministers ) రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్‌ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌
దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌
గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ
గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ
కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ
కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి : ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)
ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ
మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ
రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
విడదల రజిని : వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

వీళ్లలో అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌ , సీదిరి అప్పలరాజు, తానేటి వనితలు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

Read Previous

గూడూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా… 5 మంది అరెస్ట్

Read Next

నెల్లూరు రూరల్ లో నిరాడంబరంగా ప్రారంభమైన కోటంరెడ్డి బాట…

Leave a Reply

Your email address will not be published.