మంత్రినయ్యాను కదా… ఇక జబర్ధస్త్… సినిమాలు ఆపేస్తున్నా – రోజా వెల్లడి

Clock Of Nellore ( Amaravathi ) – ఈటీవిలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షోలో ఇక పాల్గొనను… ఇతర టీవీ షోలు, సినిమాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా… జగనన్న మంత్రిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ పదవికి న్యాయం చేస్తానంటూ స్పష్టం చేసింది… మంత్రిగా ప్రమాణం చేసిన నగరి ఎమ్మెల్యే ఆర్.కే. రోజా ( Minister RK Roja ). ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు అన్నారు రోజా. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యను’ పేర్కొన్నారు.

Read Previous

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి… సిఎంకు ధన్యవాదాలు

Read Next

గూడూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా… 5 మంది అరెస్ట్

Leave a Reply

Your email address will not be published.