Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ( MLA Kakani Govardhan Reddy )ఇంటి వద్దకు భారీగా వైసీపి నేతలు, అభిమానులు తరలివస్తున్నారు. మంత్రి వర్గంలో కాకాణికి బెర్త్ ఖాయం కావడంతో నెల్లూరులోని ఆయన నివాసం వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాల్లో కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. కాాకాణిని మంత్రిగా ప్రకటించగానే ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు నేతలు. సాయంత్రం తర్వాత రాజ్ భవన్ నుండి కాకాణికి ఫోన్ రానుంది. మరో వైపు శ్రీ రామ నవమి సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని తన నివాసానికి సమీపంలో ఉన్న సాయిబాబా గుడిని సందర్శించి పూజలు నిర్వహించారు.
