Clock Of Nellore ( Amaravathi ) – ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా జరగనున్న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఈనెల 11వ తేదీనా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో ఇప్పటికే ఉన్న మంత్రుల వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు తీసుకున్నారు. రాజీనామా లేఖలను ఇవాళ సాయంత్రం గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ రాజీనామాలను ఆమోదించారు. దీంతో మంత్రులంతా మాజీలయ్యారు. నూతన మంత్రుల జాబితా రేపు గవర్నర్ కార్యాలయానికి చేరనుంది. ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్రవేసి 11వ తేదీనా వారితో మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.
Tags: AP Politics