జగనన్న వసతి దీవెన… నెల్లూరుజిల్లాలో 53వేలా 230 మంది విద్యార్ధులకు లబ్ధి

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో జగనన్న వసతి దీవెన పధకం కింద 53 వేల 230 మంది విద్యార్థులకు రూ. 51.73 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాలకు జమచేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. శుక్రవారం వర్చువల్ విధానం ద్వారా నంద్యాల జిల్లా నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న వసతి దీవెన పధకం క్రింద స్కాలర్ షిప్ నగదును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుండి ఈ వీడియో కాన్ఫెరెన్సుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, శాసన మండలి సభ్యులు బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వెంకట నారాయణ ముదిరాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కిశోర్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సంచార జాతుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆసిఫా, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఇజ్రా, డి.ఎస్.డబ్ల్యూ.ఓ వెంకటయ్య, జగనన్న వసతి దీవెన లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లాకు సంబంధించి “జగనన్న వసతి దీవెన ” పధకం కింద అర్హులైన 53,230 మంది విద్యార్డులకు సంబందించిన 51.73 కోట్ల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, లబ్ధిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పధకాల ద్వారా పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య అందించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసి, నాడు – నేడు కార్యక్రమం ద్వారా అన్నీ పాఠశాలల్లో మంచి విద్యతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో విద్యా రంగంలో సమూలమైన మార్పులు తేవడం జరిగిందని, నాడు – నేడు కార్యక్రమం ద్వారా తొలి విడతలో 1098 పాఠశాలల్లో అన్నీ వసతులతో కూడిన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడం జరిగిందని, రెండవ విడతలో 175 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. నాడు – నేడు కార్యక్రమం వలన నేడు అన్నీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు చేకూరడంతో విద్యార్దులు ఎన్రోల్మెంట్ శాతం పెరిగిందని కలెక్టర్ తెలిపారు.

పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పధకాలను అమలు చేస్తున్నదన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగనన్న వసతి దీవెన కార్యక్రమం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 1,024 కోట్ల రూపాయలు విద్యార్డుల తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, మన జిల్లాలో కూడా 53, 230 మంది విద్యార్డులకు సంబందించి వారి తల్లుల ఖాతాలో 52 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. పిల్లల భవిష్యత్ బాగుండాలి, వారి కాళ్లపై వారి నిలబడి జీవించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, గత రెండు సంవత్సరాల కాలంలో కోవిడ్ వలన విద్య కొంత వెనుకబడిందని, ఈ సంవత్సరం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్దులకు కల్పిసున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్ది ఉన్నత చదువులు అభ్యసించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Read Previous

సన్మాన కార్యక్రమానికి వాలంటీర్ల డుమ్మా – ఎమ్మెల్యే ఆనం ఆగ్రహం

Read Next

నెల్లూరుజిల్లాలో వైసీపి నేత ఇంటిపై పెట్రోల్ పోసిన మహిళ…

Leave a Reply

Your email address will not be published.