Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా ప్రజలకు అందిస్తున్న సచివాలయ వాలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులని నెల్లూరు నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు 19వ డివిజన్ లెక్చరర్స్ కాలనీ సచివాలయంలో వారు వాలంటీర్లను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరుతుందని గుర్తు చేశారు. వారే ప్రభుత్వ పథకాల సారధులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి ప్రియ తదితరులు పాల్గొన్నారు.
