Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నరసింహకొండపై ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానానికి సంభందించి పాలక మండలి రూపొందించిన ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA KotamReddy )ఆవిష్కరించారు. ఆదివారం తన కార్యాలయంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆలయ పాలక మండలి, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మైన్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, వైసీపి రూరల్ మండల కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, దేవరపాళెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, దేవస్థాన కమిటి సభ్యులు పాల్గొన్నారు.