నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ యధాతథం… కమిషనర్ బదిలీ

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అధికారులను సర్ధుబాటు చేసే క్రమంలో పలువురు అధికారులకు స్థాన చలనం కలిగింది. నెల్లూరుజిల్లాకు సంభందించి కలెక్టర్ చక్రధర్ బాబు, స్పీ విజయరావు యధాతథంగా ప్రభుత్వం కొనసాగించింది. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న దినేష్ కుమార్ ను నూతనంగా ఏర్పడ్డ శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. నెల్లూరుజిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా ఉన్న జాహ్నవిని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా నియమించింది. జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసును నూతనంగా ఏర్పడ్డ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేసింది. కర్నూలులోని ఏపిఐఐసి లో పనిచేస్తున్న నారాయణమ్మ నెల్లూరుజిల్లా రెవెన్యూ అధికారిగా నియమించింది. నారాయణమ్మ గతంలో నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు, ఇందుకూరుపేట తహసీల్ధార్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక పోతే జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాసరావును తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా స్థాయి అధికారుల బదిలీలు మరిన్ని ఉండే అవకాశం ఉంది.

Read Previous

రాష్ట్రంలో కొత్త జిల్లాలు.. జిల్లాల వారీగా తుది నోటిఫికేషన్ల విడుదల

Read Next

డ్రగ్స్‌ కేసులో నాగబాబు కుమార్తె నిహారికకు నోటీసులు…

Leave a Reply

Your email address will not be published.