Clock Of Nellore ( Buchi ) – ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఆర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా కృషి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( IAS Chakradhar Babu ), సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాల్టీలోని రెండవ సచివాలయాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసి ఎటువంటి దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహాశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో నర సింహారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎ.పి.ఎం. లలితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
