Clock Of Nellore ( Delhi ) – నెల్లూరు – తడ మధ్య ఉన్న 4 లైన్ల జాతీయ రహదారిని 6 లైన్లుగా ఎప్పుడు మారుస్తారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ( Nellore MP ) గురువారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు దీనికోసం ఏం చర్యలు తీసుకున్నారని, ఈ నిర్మాణానికి ఎంత సమయ కాలం పడుతుందని కూడా అడిగారు. దీనికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాతపూర్వకంగా సమాధానమిస్తూ నెల్లూరు నుంచి తడ వరకు ఉన్న 16వ నంబరు జాతీయ రహదారిని నిర్మించి నిర్వహణ ప్రాతిపదికన 2031 వరకు అప్పగించామని తెలిపారు. దీనికి పూర్తి స్థాయిలో ఒక ఆకృతిని ఇచ్చి, నిర్వహించే గడువు 2031 వరకు ఉందని పేర్కొన్నారు. అందువల్ల అప్పటివరకు దీనిని విస్తరించే అవకాశం లేదని స్పష్టం చేశారు.